3rd Test Match: మూడో టెస్టు కోసం భారత్ సన్నాహం.. 11 d ago
ఆస్ట్రేలియాతో మూడో టెస్టు కోసం భారత్ సన్మాహాలు మొదలుపెట్టింది. అడిలైడ్ డే అండ్ నైట్ టెస్టులో భారీ ఓటమి తర్వాత టీమ్ ఇండియా సిరీస్‌లో మళ్లీ పుంజుకునేందుకు పట్టుదలతో కనిపిస్తున్నది. బ్రిస్బేన్ వేదికగా ఈనెల 14 నుంచి మూడో టెస్టు మొదలవనుంది. ఈ మ్యాచ్ కోసం అడిలైడ్‌లో ప్రాక్టీస్ మొదలుపెట్టింది. విరాట్‌కోహ్లీ, యశస్వి జైస్వాల్, రోహిత్‌శర్మ, రిషబ్ పంత్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయగా బౌలర్లు ఆకాశ్‌దీప్‌సింగ్, యశ్ దయాల్, హర్షిత్రానా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా ఫామ్‌లేమితో నానా ఇబ్బందులు పడుతున్న కెప్టెన్ రోహిత్‌శర్మ ఎక్కువసేపు నెట్స్‌లో గడిపాడు.